Wednesday, 7 January 2015

సాక్షి లో గోల్డెన్ షేక్ హ్యాండ్


సాక్షి మీడియాలో భారీగా సంస్కరణలు జరుగుతున్నాయి. సాక్షి లో ఇప్పుడు సిబ్బందికి గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. జర్నలిస్టుల్ని తీసేసాం అనే అప ప్రద రాకుండా, గోల్డెన్ షేక్ హ్యాండ్ తో ఇంటికి పంపుతున్నారు. మూడు నెలల అడ్వాన్స్ + రెండు నెలల లీవులు + చట్ట ప్రకారం వచ్చే అన్ని లాభాలు ఇస్తున్నారు.


 ఇటీవల జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. నెలకు కోటి నుంచి 2 కోట్ల వరకు ఖర్చు తగ్గించుకోవడమే టార్గెట్ గా మీటింగ్ జరిగిందట.

ఇందులో భాగంగా పెద్ద మొత్తంలో జీతాలు తీసుకునే వాళ్లకు పలు కీలక బాధ్యతలను అప్పగించనున్నారు. మూడు జిల్లాలకు కలిపి ఓ స్టాఫ్ రిపోర్టన్‌ను ఉంచి మిగిలిన వారిని ఇంటికి పంపిచే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఎవరు ఏ చిన్న తప్పు చేస్తారా అని యాజమాన్యం కాచుకుని చూస్తోందట. వారిని ఆ సాకుతో ఇంటికి పంపించే ప్రయత్నాలే ఎక్కువగా జరుగుతున్నాయట. సాక్షి దినపత్రిక రిపోర్టర్లనే సాక్షి టీవీకి కూడా రిపోర్టింగ్ చేయించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారట. అలాగే ఛానెల్లో చాలా మందికి పని ఉండడం లేదని భావించిన యాజమాన్యం పలువురు రిపోర్టర్లను, కెమేరామెన్లను తీసేసేందుకు ప్లాన్ రచిస్తోందట. 20000లకు పైన ఉన్న కెమెరామెన్లను తీసివేయడమా...జీతాల్లో కోత విధించడమా అన్నదిశగా ఆలోచిస్తున్నారట.

 తెలంగాణలో పేపర్ సర్క్యులేషన్‌పై అంతగా దృష్టి సారించకపోవడంతో ఇక్కడ సాక్షి సర్య్కులేషన్ రోజురోజుకు దారుణంగా పడిపోతోందట. పోటీ పత్రిక ఈనాడు 18 లక్షలను క్రాస్ చేస్తే సాక్షి కేవలం 12.5 లక్షల వద్దే ఆగిపోయిందట. దీంతో తెలంగాణలో గ్రేటర్ మినహా మిగిలిన జిల్లాల్లో నామ్‌కే వాస్తేగా పేపర్‌ను నడిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు... సాక్షి అసిస్టెంట్ ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రమూర్తికి పలు మీడియా సంస్థల్లో ప్రియ శిష్యులు ఉన్నారు. ఆయన వారిని సాక్షిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే భారీ సంస్కరణలు జరుగుతున్నాయన్న వార్తలు గుప్పుమనడంతో సాక్షి ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో.. ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితితో ఆందోళన చెందుతున్నారట.

No comments:

Post a Comment