స్వాములోరు ఛానల్ పెట్టబోతున్నారు. భక్తీ టీవీ ద్వారా టీవీ లో ఓ వెలుగు వెలిగిన పరిపూర్ణ నంద, టీవీ 5 లో కూడా తరచూ కనిపిస్తూ ఆకట్టు కున్నారు.
ఇప్పుడు ఆయనో కొత్త అవతారం ఎత్త బోతున్నారు. స్వామికి ఒక ఛానల్ పెట్టేస్తే ఎలా ఉంటుంది అనే కోరిక కలిగింది. కొత్త చానల్ నిర్వహణలో దయానంద సరస్వతి ట్రస్టు నిధులు కూడా సమకూర్చే అవకాశం ఉంది. అప్పుడప్పుడు అమెరికా యాత్రలు చేసిన స్వామి.. కొందరు ఎన్నారై లను కూడా గట్టి ఓ ఆధ్యాత్మిక ఛానల్ కి కంకణం కట్టుకున్నారు.
ఓ న్యూస్ ఛానల్ అధినేత ఆశీస్సులు... దయానంద సరస్వతి ట్రస్టు సహాయం, స్వామి శిష్యుల తోడ్పాటు తో ఛానల్ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఓ మాజీ పొలిసు అధికారి రామచంద్ర రాజు దీనికి సి ఈ ఓ గా రాబోతున్నాడు. ఓ సీనియర్ జర్నలిస్ట్ చీఫ్ ఎడిటర్ గా త్వరలో చేరబోతున్నాడు. భక్తీ టీవీ లో చేసిన వ్యక్తీ మార్కెటింగ్ హెడ్ బాధ్యతలు తీసుకో బోతున్నాడు. ప్రస్తుతం టెక్నికల్ పనులు మొదలయ్యాయి. అయితే మేనేజ్మెంట్ - ఖర్చు విషయంలో గీసి గీసి బేరం ఆడుతోంది. టెక్నికల్ వర్క్స్ కి 13 కోట్లకి గాను - 3 కోట్లు మా బడ్జెట్ అని ఓ సంస్థ అధికారుల్ని పంపించి వేశారంట. చైనా లో లేదా ఢిల్లీ లో సరుకు ఏదైనా దొరుకుతుందేమో చూస్తున్నారు.
టీ వీ 5 ఎదురుగా అద్దె భవనం లో గత 7 రోజులుగా కొత్త చానల్ లో పూజలు జరుగుతున్నాయి.
ఆధ్యాత్మిక సామ్రాజ్యం లో ఆధిపత్యం చెలాయిస్తున్న భక్తీ టీ వీ కి పోటీగా ఈ చానల్ ని తీసుకు రావాలని స్వాములు భావిస్తున్నారు. భక్తి టీ వీ లో వ్యాపార ప్రకటనల ధర అధికంగా ఉండటం తో బిజినెస్ పరంగా తమ కొత్త చానల్ కి అవకాశాలు పెరుగుతాయని స్వాములు భావిస్తున్నారు.
స్వామి చానల్ అయిడియా వెనుక...
ఇంతకీ స్వామి చానల్ పెట్టాలని ఎందుకు వ్యాపారస్తుల్ని కూడా గట్టారో అయన ఫాలో వర్స్ కి అర్ధం కావడం లేదు. ఓవర్ నైట్ స్వామి కి కొత్త చానల్ అయిడియా ఎలా వచ్చిందా అని అంతా చర్చించు కుంటున్నారు.
ఇక, ఆద్యాత్మిక చానల్స్ ఎన్నో మార్కెట్లోకి వచ్చాయి. సి వి అర్, అర్చన పూర్తిగా వెనకబడి పోగా, టీ వీ 9 వారి సంస్కృతి కాల క్రమంలో తెలంగాణా చానల్ గా మారి పోయిన విషయం విదితమే. పూజ గురించి పెద్దగా వినికిడి లేదు.