మరో ఛానల్ రాబోతోంది. ప్రఖ్యాత జర్నలిస్ట్ ఎ.బి.కె ప్రసాద్ అధ్వర్యంలో ఈ ఛానల్ కి సంభందించి ఇప్పటికే పత్రికల్లో వాంటెడ్ ప్రకటనలు వచ్చాయి. పేరు - నెంబర్ వన్ అని పెట్టినట్లు చెబుతున్నారు. ఎ.బి.కె- పలు పత్రికల్లో ఎడిటర్ గా చేసి మంచి పేరు సంపాదించారు. అందులో డవుట్ లేదు. కానీ ఇప్పటికే సీనియర్ జర్నలిస్టు వెంకట్రావు గారు పెట్టిన ఛానల్ ఎలా ఉందో చూస్తున్నాం. మహా న్యూస్ ఎక్కడో ఆఖరులో ఉంది.
ఎ.బి.కె వెబ్ గొప్పదనాన్ని తక్కువ చేయడం మా ఉద్దేశం కాదు. ఆయన 1997 లలోనే వెబ్ మీడియాలో కూడా వేలు పెట్టారు. హైదరాబాద్.కం అనే సైట్ కి ఎడిటర్ గా చేసారు. ఇది అమీర్ పేటలో ఉండేది. 2 నెలల్లోనే ఆయనకి పడక బయటికి వచ్చేసారు. అప్పట్లోనే ఆయనకి 20 వేలు ఇచ్చి తీసుకున్నారు. వాంటెడ్ ప్రకటనలు కూడా ఇచ్చారు.
ప్రస్తుతం ఈ ఛానల్ కోసం యాజమాన్యం కొందర్ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.
చాల కాలం తర్వాత ఎ.బి.కె ని మళ్లీ మీడియాలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎం ఎస్ ఆర్ అనే వ్యాపార వేత్త. ఇది మంచి పరిణామమే. అయితే విలువలు దూరమయి పోయిన ఈ పోటీ ప్రపంచంలో ఎ.బి.కె వంటి వ్యక్తి నెగ్గుకు రాగలరా ? ఛానల్ ని నెంబర్ వన్ చేయగలరా అనేదే ప్రశ్న.
ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు ఇతర అప్ డేట్స్ కోసం : telugumedia24x7.blogspot.com
No comments:
Post a Comment